letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de nee navvu - s.p. balasubrahmanyam

Loading...

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ లాలలాలా ఓ లాలలాలా

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ
పంచేదుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అనీ

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నుదురిలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఆ లాలలాలా ఆ లాలాలలాలా

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

letras aleatórias

MAIS ACESSADOS

Loading...