letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de from "malle puvvu" - s. p. balasubrahmanyam

Loading...

మల్లెల మంటల రేగిన గ్రీష్మం నా గీతం…
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం…
ఆ వెన్నెల తో చితి రగిలించిన కన్నులు నా సంగీతం…

ఆపేసావెం బాబు.బాగుంది.ఆలపించు…

ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
ఎవరికి తెలుసూ…
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ…

మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ

చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ

జగతికి హృదయం లేదని
ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదనీ
ఆ.
ఎవరికి తెలుసూ…
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ…

గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం

నిప్పులు చెరిగే నా గీతంలో . నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో . నిట్టూరుపులే సంగీతం

ప్రేమకు మరణం లేదని
నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదనీ
ఆ.
ఎవరికి తెలుసూ…
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ… మ్మ్.మ్మ్.మ్మ్

చిత్రం: మల్లెపువ్వు (1978)
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

letras aleatórias

MAIS ACESSADOS

Loading...