letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de abhimani lenide - s. p. balasubrahmanyam

Loading...

చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం: గురుకిరణ్
సాహిత్యం: చంద్రబోస్

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే

నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా
నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వో బ్రహ్మరా
మనసే కోరే మందు ఇదే
మనిషికి చేసే వైద్యమిదే
అల్లోపతి టెలీపతీ
అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను నీ సంగతి

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

ఒణకు బెణుకు తొణుకు వదలరా
జర ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే

సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా
సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా
ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు
దేహం నువ్వే ప్రాణం నువ్వే
దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

చమకు చమకు చురుకు చూపైరా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

letras aleatórias

MAIS ACESSADOS

Loading...