
letra de chukkala thotalo - s. p. balasubrahmanyam feat. p. susheela
చుక్కల తోటలో ఎక్కడున్నావో .
పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .
నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ
నీలి నీలి నీ కురులా . నీలాల మేఘాల .
విరిసింది మల్లికా నా రాగ మాలికా
అల్లిబిల్లి నీ కౌగిట . అల్లుకున్న నా మమతా . కొసరింది కోరికా అనురాగ గీతికా
నీ మూగ చూపులలో . చెలరేగే పిలుపులలో
నీ పట్టువిడుపులలో . సుడి రేగే వలపులలో
కన్నూ కన్నూ కలవాలీ కలిసి వెన్నెలై పోవాలీ
చీకటి వెన్నెల నీడలలో దాగుడుమూతలు ఆడాలీ
చుక్కల తోటలో ఎక్కడున్నావో .
పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .
నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి ఉన్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో
ఈ పూల వానలలో . తడిసిన నీ అందాలూ
ఆ. ఆ. ఈ పూట సొగసులలో . కురిసిన మకరందాలూ
నీలో తీగలు మీటాలీ నాలో రాగం పలకాలీ
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలీ!
చుక్కల తోటలో ఎక్కడున్నావో .
పక్కకు రావే మరుమల్లె పువ్వా.ఆహా.ఆహా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .ఆహా.ఆహా
నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
letras aleatórias
- letra de x change - lp rambo & dd caine
- letra de unquiet grave - lau
- letra de recuerdos - la pegatina
- letra de dire qu'il faudra mourir un jour - georges moustaki
- letra de bonfire, pt. 2 - yungmanny
- letra de o mαχητής (o mahitis) - 12os pithikos
- letra de bokura no yume - ikimono gakari
- letra de дети с мечтами (children with dreams) - mozee montana
- letra de once in a million years - lo noom
- letra de black hole - p-white