letra de sri anjaneya - p. susheela
ll ఆంజనేయమతి పాటలాననం ll
ll కాంచనాద్రి కమనీయ విగ్రహమ్ ll
ll యత్ర యత్ర రఘునాధ కీర్తనం ll
ll తత్ర తత్ర కృత మస్త కాంజలిమ్ ll
ll బాష్పవారి పరి పూర్ణ లోచనం ll
ll భావయామి పవమాన నన్దనమ్ ll
శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ…
శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.
మాంపాహి పాహి. మాం పాహి పాహి…
ll తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|
ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి:||
సుందరమైనది సుందరకాండ
సుందరకాండకు నీవే అండ…
సుందరమైనది సుందరకాండ
సుందరకాండకు నీవే అండ
వారధి దాటి సీతను చూచి
అంగుళి నొసగి లంకను కాల్చిన
నీ కథ వింటే మాకు కొండంత బలమంట.
శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.
మాంపాహి పాహి. మాం పాహి పాహి…
ll తతస్థం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః |
భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంత మభాషత ||
శ్రీ రఘురాముని ఓదార్చినావూ
వానర సైన్యాన్ని సమకూర్చినావు…
శ్రీ రఘురాముని ఓదార్చినావూ…
వానర సైన్యాన్ని సమకూర్చినావు
నీసాయముంటే నిరపాయమేనని
నమ్మిన నన్ను ఏ దరి చేర్చేవు…
నా నమ్మిక వమ్మైతే నాగతి ఏమౌను.
శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.
మాంపాహి పాహి. మాం పాహి పాహి…
దుష్ట శిక్షకా శిష్ట రక్షక ధర్మ పాలకా ధైర్య దీపికా
జ్ఞాన కారక విజయ దాయక నిన్ను కానక నేను లేనిక
జయకర శుభకర వానర ధీవర ఇనకుల భూవర కింకర
త్రిభుజన నిత్య భయంకర…
రావేరా దరిశనమీవేరా… అఆ…
రావేరా దరిశనమీవేరా… అఆ… అఅఅఅఆఆఆఆ
letras aleatórias
- letra de wanted (original version) - blanco
- letra de camisa de varzea - gabiro
- letra de over the bridge - r soul
- letra de lvl-death - ke playa x psychomane
- letra de cryptical - pænda
- letra de deaf - kevvbmm
- letra de why? - kamikazexxx
- letra de icy vibes - sensey (cz)
- letra de so high* - lottu g & blaque song
- letra de gün - dr.fuchs