letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de oho chakkani chinnadhi - p. b. sreenivas & ashalatha kulkarni

Loading...

ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో
ఆఅ ఆఅ ఆఅ హా

ఓఓ ఓఓ ఓఓ హో
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .
తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

పెద్దల అనుమతి తీసుకో ప్రేమను సొంతం చేసుకో హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

మనసే దోచిన సుందరి మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.
ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే తోడునీడై కలకాలం సాగిపోదాము
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో

letras aleatórias

MAIS ACESSADOS

Loading...